పట్టిపట్టి పంగనామం పెడితే గోడ చాటుకు వెళ్ళి చెరిపి వేసుకున్నాడట.
పెదిమ దాటితే పెన్న దాటును.
పీనాసి వాడి పెళ్ళికి పచ్చడి మెతుకులు సంభవమట.
పెళ్లి అంటే నూరేళ్ల పంట.
పెళ్లికి, శ్రార్దానికి కూడ ఒకటే మంత్రం చదివాడట.
పెళ్లికి వెలుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్లినట్టు.
పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు.
పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట.
పెరగుట తరగుట కొరకె.
పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు.
ఫలించే వృక్షానికే రాతి దెబ్బలు అన్నట్లు.
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము.
పిలవని పేరంటానికి వెళ్లినట్లు.
పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడట.
పిల్లి గడ్డానికి జపాన్ బ్లేడు అన్నట్టు.
పిల్లి కి బిచ్చం వేయని పిసినారి.
పిల్లి సేపాలకు ఉట్లు తెగుతాయా?
పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23
తెలుగు సామెతలు,Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,
పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం.









No comments:
Post a Comment