http://www.www.nlginfo.blogspot.com/2014/12/swapna-agencies-nalgonda.htmlhttp://www.nlginfo.blogspot.com/2014/12/sai-traders-nalgonda.htmlhttp://www.nlginfo.blogspot.com/2014/12/v-s-traders-nalgonda.htmlhttp://www.nlginfo.blogspot.com/2014/12/laxmi-narasimha-swamy-ceramics-and.html
http://www.nlginfo.blogspot.com/2014/12/sri-vinayaka-ladies-emporium-nalgonda.htmlhttp://www.nlginfo.blogspot.com/2014/12/sri-sri-kaladarshini-family-show-room.htmlhttp://www.nlginfo.blogspot.com/2014/12/ramya-silk-centre-suitings-and.htmlwww.nlginfo.blogspot.com/2014/12/a-venkata-ramana-insurance-agent.html
Showing posts with label Telugu Usage. Show all posts
Showing posts with label Telugu Usage. Show all posts

తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 2

అడవారి మాటలకు అర్థాలే వెరులే.
అడవి కాచిన వెన్నెల.
అడవిలో పెళ్ళికి జంతువులే పురోహితులు.
అడిగే వాడికి చెప్పేవాడు లోకువ.
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు.
అడుక్కున్నమ్మకు అరవయ్యి కూరలట, వండుకున్న అమ్మకు ఒకటే కూరట.
అడుసు తొక్కనేల కాలు కడగనేల.
ఏమి లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము.
అగడ్తలో పడ్డ పిల్లికి అడ్డే వైకుంటము.
అగ్నికి ఆజ్యం పోసినట్లు.
అగ్నికి వాయువు తోడైనట్లు.
ఐశ్వర్యము వస్తే అర్థ రాత్రి గొడుగు పట్టమనేవాడు.
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చింది.
ఆకులు నాక్కునే వాడి దగ్గర మూతులు నాక్కునే వాడట.
అమాయకునికి అక్షింతలు ఇస్తే ఆవలకి వెళ్ళి నోట్లో వేసుకున్నాడట.
అంబలి నాకెటోడికి మీసాలెత్తేటోడొకడు.
అంభం లొ కుంభం లా.
అమ్మ కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది
అందం అన్నం పెట్టదు.
అందుని ముందు అందాలేల?
అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు.



పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23
తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 3

ఆడి తప్ప రాదు, పలికి బొంక రాదు.
ఆకాశానికి హద్దే లేదు.
ఆకలి రుచి యెరుగదు, నిద్దుర సుఖము యెరుగదు, వలపు సిగ్గు యెరుగదు.
ఆకలి వేస్తే రొకలి మింగమన్నాడట.
ఆకు యెగిరి ముల్లు మీద పడ్డ, ముల్లు వచ్చి ఆకు మీద పడినా చిరిగేది ఆకే.
ఆలస్యం అమృతం విషం.
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సొమలింగం.
ఆరే దీపానికి వెలుగు యెక్కువ.
ఆరోగ్యమే మహాభాగ్యము.
ఆస్తి మూరెడు ఆశ బారెడు.
ఆత్రగానికి బుద్ది మట్టము.
ఆవలింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడట.
ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్లు.
ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తుందా?
ఆయనే వుంటే మంగలి ఎందుకు?
అబద్దము ఆడినా అతికినట్లు ఉండాలి.
అభ్యాసము కూసు విద్య.
అచ్చిగాడి పెళ్ళిలో బుచ్చిగాడికి ఒక జంజపు పోగు.
అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు.
పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 4


బంతిలో బాలపక్షం.
బతకలేని బడి పంతులు.
బతికుంటే బలుసాకు తినవచ్చు.
బెల్లం చుట్టూ ఈగల్లా.
బెల్లం కొట్టిన రాయిలా.
భార్య గుణవతి శత్రు.
భక్తి లేని పూజ పత్రి చేటు.
బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ.
బోడి ముండకి మంగళ హారతి ఒకటి.
బూడిదలో పొసిన పన్నీరు.
ఆడ పిల్ల, సిగ్గు బిళ్ళ పలువురి లో కనిపించ రాదు.
ఆడబోయిన తీర్దము యెడురైనట్లు.
ఆడదాని వయస్సు మగవాని సంపాదన అడగొద్దన్నట్టు.
ఆడలేక మద్దెల వోడు అన్నట్లు.
ఆది లోనే హంస పాదు.
పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23
తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 5

చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే యేడుస్తాడు.
చాప కింద నీరులా.
చావు కబురు చల్లగా చెప్పినట్టు.
చావు తప్పి కన్ను లొట్ట పొయినట్లు.
చచ్చినవాని కండ్లు చారెడు.
చచ్చిన వాడి పెళ్ళికి వచ్చిందే కట్నం.
చద్ది కూడు తిన్నమ్మ మొగుడాకలి యెరగదట.
చదివిన కొద్దీ ఉన్నమతి పోయింది.
చదువు రాని వాడు వింత పశువు.
చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ.
చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు.
చక్కనమ్మ చిక్కినా అందమే.
చల్ల కొచ్చి ముంత దాచినట్లు.
చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా తిరిగాడట.
చస్తుంటే సంధ్యా మంత్రమన్నాడట ఒకడు.
చెడపకురా, చెడేవు.
చెముడా అంటే మొగుడా అన్నట్టు.
చెప్పే వాడికి వినే వాడు లొకువ.
చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు.
చెరపకురా చెడేవు, ఉరకకురా పడేవు.
చెరువుకి నీటి ఆశ, నీటికి చెరువు ఆశ.
చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లు.
చెవిలో జోరీగ లాగా.
చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లు.

పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23
తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 6

దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు.
దక్కిందె దక్కుడు.
దమ్మిడి ముండకు ఏగాని క్షవరం.
దంపినమ్మకు బొక్కిందె కూలిట.
దన్చినమ్మకి బొక్కిందీ దక్కుదు.
దండం దశ గుణం భవేత్.
దరిధ్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన.
దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట.
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకొవాలి.
దెముడికి దక్షిణ ఎందుకెయ్యాలంటే ఉత్తరం వేస్తే వెళ్ళదు కనుక.
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు.
దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు.
దిన దిన గండం, కాని దీర్గాయిశ్శు.
దొంగ చేతికి తళాలు ఇచ్చినట్లు.
దొంగకు దొంగ బుద్ది, దొరకు దొర బుద్ది.
దొంగకు తేలు కుట్టినట్లు.
దూరపు కొండలు నునుపు.
దున్మపోతు మీద వర్షం కురిసినట్లు.
దురాశ దుఖానికి చేటు.

పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23
తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 7

గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్చ పొయిందట.
గాజుల బేరము భోజనానికి సరి.
గాలిలో దీపం పెట్టి దెవుడా నీదె భారం అన్నట్టు.
గాలికి పొయే దానిని గుండుకి చుట్టుకున్నట్లు.
గంతకు తగ్గ బొంత.
గతి లేనమ్మకు గంజే పానకము.
గోరుచుట్టు మీద రోకలి పోటు.
గోడ మీది పిల్లి.
గోడలకు చెవులుంటాయి.
గొడ్డుని చూసి గడ్డెయ్యాలి.
గొముఖ వ్యాఘ్రమ్.
గొంతెమ్మ కోరికలు.
గొటితొ పొయేదానికి గొడ్డలి వాడినట్టు.
గ్రుడ్డి కన్న మెల్ల మేలు.
గ్రుడ్డి ఎద్దు జొన్న చేలొ పడినట్లు.
గ్రుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు.
గుడ్డికన్ను మూసినా ఒకటే, తెరిచినా ఒకటే.
గుడి మింగే వాడికి నంది పిండిమిరియం.
గుడిని, గుడిలో లింగాన్ని, మింగినట్లు.
గుడ్ల మీద కోడిపెట్ట వాలే.
గుంభనం గునపం లాంటిది, బయటే వాడుకొవాలి,కడుపులో వున్టే పోట్లు పొడుస్టుంది.
గుమ్మడి కాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకొన్నాడట.
గురువుకు పంగనామాలు పెట్టినట్లు.
గురువును మింగిన శిశ్యుడు.
ఎద్దులాగా ఏడాది బ్రతికే కంటె, ఆంబోతు లాగా ఆరు నెలలు బ్రతికితే చాలు.
ఎదురుగా ఉన్నవాడె పెళ్ళికొడుకు అందిట.
ఈ ఊరుకు ఆ ఊరు ఎంత దూరమో, ఆ వూరు నుంచి ఈ ఊరు అంతే దూరం.
ఈతకు మించిన లోతు లేదు.
ఎలుగు బంటి తోలు ఎన్నాళ్ళు ఉతికినా ,నలుపు నలుపేకాని తెలుపు రాదు.
ఎంగిలి చెతితొ కాకిని తోలడు.
ఎంత చెట్టుకి అంత గాలి.
ఎర్ర చీర కట్టున్నదల్లా నీ పెళ్ళామే?
ఎవడి ముడ్డి కింద నీళ్ళు వొస్తే వాడికి తెలుస్తుంది బాధ ఏమిటో.
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.
దాసుని తప్పు దండంతో సరి.
డబ్బివ్వని వాడు పడవ ముందు ఎక్కాడట.
డబ్బు పొయే శని పట్టె.
డబ్బుకు లోకం దాసొహం.

పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23
తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 8

కొరకరాని కొయ్యాలా.
కొరివితో తల గోక్కొవడం.
కోతి పుండు బ్రహ్మ రాక్షసి.
కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు.
కోతికి పుండైతే గీక నాక.
కొత్తొక వింత - పాతొక రోత.
కొత్త అప్పుకు పోతె పాత అప్పు బయటపడ్డదట.
కొత్త భిచ్చగాడు పొద్దు ఎరగడు.
కృషితో నాస్తి దుర్భిక్షం.
క్షేత్రమెరిగి విత్తనం, పాత్రయెరిగి దానం.
కుడుము చేతికిస్తే పండగ అనేవాడు.
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.
కుక్క వస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదు.
కుక్షిలో అక్షరం ముక్క లెదు కానీ.
కుళ్లు ముండకి అల్లం పచ్చడి అన్నట్టు.
ఇంట గెలిచి రచ్చ గెలువు.
ఇంట తిని, ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు.
ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు.
ఇంటి పేరు కస్తూరివారు; ఇంటిలో గబ్బిలాల కంపు.
ఇంటికన్న గుడి బద్రము.
ఇంట్లో చూరు కింద నీళ్లు తాగి, బయటకొచ్చి చల్ల తాగామని చెప్పుకుంటారు.
ఇంట్లో ఈగలా మోత బైట పల్లకి మోత.
ఇస్తే హిరణ్య దానం, ఇవ్వక పొతే కన్యా దానం.
ఇసుక తక్కెడ పేడ తక్కెడ.

పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23
తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 9

కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు.
కాగల కార్యం గందర్వులే తీర్చినట్లు.
కాకి ముక్కుకు దొండ పండు.
కాకి పిల్ల కాకికి ముద్దు.
కాకిలా కలకాలం బ్రతికేకన్నా, హంసలా ఆరు నెలలు బ్రతికినా చాలు.
కాలం కలిసి రాక పొతే, కర్రే పామై కాటు వేస్తుంది.
కాలికేస్తె మెడకి, మెడకేస్తే కాలికి.
కాలు జారితె తీసుకోగలం కాని, నోరు జారితె తీసుకోగలమా!
కాశాయం కట్టిన వాల్లందరు సన్యాసులు కారు, కశాయం మింగిన వాళ్ళందరికి కఫం కరగదు.
కాసు ఉంటే మార్గముంటది.
కడుపు చించుకుంటే కాళ్లపై పడ్డట్లు.
కలకాలపు దొంగ ఒకనాడు దొరుకును.
కలిమి లేములు కావడి కుండలు.
కలిసి ఉంటే కలదు సుఖం.
కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు.
కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్లు
కంచే చేను మేసినట్లు
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా.
కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు?
కందకు కత్తిపీట లోకువ.
కందెన వేయని బండికి కావాల్సినంత సంగీతం.
కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం.
కర్ర ఇచ్చి పళ్లు రాలకొట్టిచ్చు కోవటం.
కష్టే ఫలే.
కట్టె కొట్టె తెచ్చె.
కయ్యానికి కాలు దువ్వడం.
కీడెంచి మేలెంచమన్నారు.
కొడితె ఏనుగు కుంభస్ధలం మీద కొట్టాలి.
కొంప కొల్లేరు అయ్యింది.
కొనబోతె కొరవి అమ్మబోతె అడవి.
కొండనాలికకు మందెస్తే ఉన్న నాలిక ఊడిందట.
కొండను తొవ్వి ఎలుకను పట్టినట్లు.
కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి.

పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23
తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 10

మాటలు నెర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అందట.
మేక వన్నె పులి.
మెరిసేదంతా బంగారం కాదు.
మెత్తగా ఉంటే మొట్ట బుద్ది అయ్యిందట.
మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె!
మొగుడ్ని తన్ని మొగసాలకెక్కిందట
మొగుడు కొట్టినందుకు కాదు, తొటికోడలు దెప్పినందుకు.
మొహమటనికి పొతె కడుపు అయ్యిందట
మొండి వాడు రాజు కన్నా బలవంతుడు.
మూల విగ్రహనికి లేక ముస్టి ఎత్తుకుంటుంటె, ఉత్సవ విగ్రహలు వచ్చి వూరేగింపు ఎప్పుడు అన్నాయట.
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు.
మూన్నాళ్ల ముచ్చట.
మొరటి వాడికి మొగలి పువ్వు ఇస్తే మడిచి ముడ్లో పెట్టుకున్నాడట.
మొరిగే కుక్క కరవదు.
మోసేవానికి తెలుసు కావడి బరువు.
ముడ్డి మీద తంతే మూతి పళ్ళు రాలినట్టు.
ముక్కట్టుకొమంటే బ్రాహ్మడి ముక్కు పట్టుకున్నాడట.
ముక్కు మీద కోపం.
ముక్కుకు సూటిగా పోవడం
ముళ్ళ కంప మీద పడిన గుడ్డలా.
ముల్లును ముల్లుతొనే తీయాలి, వజ్రాన్ని వజ్రం తోనే కొయ్యాలి.
ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు.
ముందు గొయ్యి - వెనుక నుయ్యి.
ముందు వచ్చిన చెవుల కంటె వెనకొచ్చిన కొమ్ములు వాడి.
ముందుంది ముసళ్ల పండగ.
ముంజేటి కంకణానికి అద్దం ఎందుకు?
ముసలోడికి దసరా పండగన్నట్లు.
జోగి జోగి రాసుకుంటె రాలేది బూడిదే.
జుట్టు ఉన్న అమ్మ యే కొప్పైనా పెడుతుంది.

పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23
తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 11

మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లు.
మాటలు చూస్తే కొతలు దాటుతాయి.
మాటలు నేర్చిన కుక్క ఉస్కోమంటె కిస్కో ఉస్కో అందట.
మంచి వాడు, మంచి వాడు అంటె, మంచమెక్కి గంతులేసాడుట.
మంచికి పోతె చెడెదురైనట్లు.
మంచిమాటకు మంది అంతా మనవాల్లే.
మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అయినట్లు.
మందుకి పంపితే మాసకానికి వచ్చాడట.
మనిషి మర్మము, మాని చేవ బయటకు
తెలియవు.
మనిషి పేద అయితే మాటకు పేదా?
మనిషికి మాటే అలంకారం.
మనిషికొక మాట - గొడ్డుకొక దెబ్బ.
మనిషికొక తెగులు మహిలొ వేమ అన్నారు.
మనిషొకటి తలిస్తే, దేవుడొకటి తలిచాడట.
మంత్రాలకు చింతకాయలు రాలవు.
మంత్రాలు తక్కువ, తుంపర్లు ఎక్కువ.

తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 12

నారు పొసిన వాడు నీరు పొయ్యడా?
నడుమంత్రపు సిరి, నరాల మీదపుండు ఆగనివ్వవట.
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందొ, నీ మాటలో అంతే నిజం ఉంది.
నక్కకి నాగలొకానికి ఉన్నంత తేడా.
నాట్యం చెయ్యవే రంగసాని అంటే నేల వంకర అందట.
నవ్వే ఆడదాన్ని, యెడ్చే మగవాడిని నమ్మకూడదు.
నవ్విన నాప చెనే పండుతుంది.
నవ్వు నాలుగు విదాల చేటు.
నవ్వులు పోయి నువ్వులౌతాయి.
నీ చెవులకు రాగి పోగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు.
నీ నెత్తి మీద ఎదో ఉంది అంటే అదేదో నీ చెత్తోనే తీసెయ్యి అన్నదట.
నీ ఎడమ చెయ్యి తియ్యి నా పుర చెయ్యి పెడతానన్నాడట ఒకడు.
నీకోడి కూస్తేకానీ తెల్లవారదా.
నీరు పల్లమెరుగు, నిజము దేముడెరుగు.
నిదానమే ప్రదానం.
నిజం నిలకడ మీద తెలుస్తుంది.
నిజం నిప్పు లాంటిది.
నిమ్మకు నీరు ఎత్తినట్లు.
నిండా మునిగితే చలే ఉండదు.
నిండు కుండ తొనకదు.
నిప్పు ముట్టనిది చేయి కాలదు.
నోరు మంచిదైతే, ఊరు మంచిది.
నువ్వు మేకని కొంటే, నేను పులిని కొని నీ మెకని చంపిస్తా అన్నాడట.

పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23
తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 13

పిల్లికి ఎలుక సాక్ష్యం.
పిండి కొద్ది రొట్టె.
పిట్ట కొంచెం కూత ఘనము.
పోరు నష్టము పొందు లాభము.
పూస గుచ్చినట్టు చెప్పడం.
పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నడట.
పొరుగింటి పుల్ల కూర రుచి.
పొట్ట కొస్తే అక్షరం ముక్క రాదు.
పొట్టి వానికి పుట్టెడు బుద్దులు.
పోటుగాడు పందిరి వేస్తే పిచ్చికలు వచ్చి కూల దోసాయట.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.
పుండు మీద కారం చల్లినట్లు.
పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్ది బిడ్డలు.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు.
ఒకడికి అద్రుష్టం కలిసి వచ్చి స్వర్గానికి వెళ్తే, రంభ ముట్లయి కూర్చుందిట.
ఒంటి పూట తిన్నమ్మ ఓర్చుకుంటే, మూడు పూటలు తిన్నమ్మ మూర్చ పొయిందట.
ఊళ్లో పెల్లికి అందరూ పెద్దలే.
ఊళ్ళో పెళ్లికి కుక్కల హడవుడి.
ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు.
ఊరక రారు మహానుభావులు.
ఊరంతా చుట్టాలు, ఉట్టికట్ట తావు లేదు.
ఊరు మొహం గోడలు చెప్పుతాయి.
ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది.
ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడి గుండంత సుఖం లేదు.
ఒట్టు తీసి గట్టున పెట్టు.

పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23
తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 14


పట్టిపట్టి పంగనామం పెడితే గోడ చాటుకు వెళ్ళి చెరిపి వేసుకున్నాడట.
పెదిమ దాటితే పెన్న దాటును.
పీనాసి వాడి పెళ్ళికి పచ్చడి మెతుకులు సంభవమట.
పెళ్లి అంటే నూరేళ్ల పంట.
పెళ్లికి, శ్రార్దానికి కూడ ఒకటే మంత్రం చదివాడట.
పెళ్లికి వెలుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్లినట్టు.
పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు.
పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట.
పెరగుట తరగుట కొరకె.
పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు.
ఫలించే వృక్షానికే రాతి దెబ్బలు అన్నట్లు.
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము.
పిలవని పేరంటానికి వెళ్లినట్లు.
పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడట.
పిల్లి గడ్డానికి జపాన్ బ్లేడు అన్నట్టు.
పిల్లి కి బిచ్చం వేయని పిసినారి.
పిల్లి సేపాలకు ఉట్లు తెగుతాయా?

పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23
తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం.

తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 15

పంచ పాండవులు ఎంత మంది అని అడిగితే - మంచం కొళ్ళలా ముగ్గురు అని రెండు వేళ్ళు చూపించాడట.
పాండవులు సంపాదించిన రాజ్యం కౌరవుల తద్దినానికి సరిపోయిందట.
పండిత పుత్రః పరమ శుంఠః
పనిలేని మంగలోడు పిల్లి తల గొరిగినట్టు.
పప్పులో కాలేసినట్టు.
పరాయి సొమ్ము పాము వంటిది.
పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు.
పట్ట పగలు కాకులు కావు కావు మంటుంటె మొగుడిని కౌగలించుకుందట.
పట్టిందల్లా బంగారమైనట్లు.పాడిందె పాడరా పాచిపళ్ళ దాసరా.
పాకి దానితో సరసం కంటే అత్తరు సాయిబుతో కలహం మేలు.
పానకంలో పుడక.
పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్లి మూర వేసిందట.
పాపి చిరాయువు.
పచ్చ కామెర్ల వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడుతుంది.
పదుగురాడు మాట పాడిఅయ్యి చెల్లు.
పక్కలో బల్లెం.
పంచ పాండవులు ఎంత మంది అని అడిగితే - మంచం కొళ్ళలా ముగ్గురు అని రెండు వేళ్ళు చూపించాడట.
పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 16

తాటాకు చప్పుళ్ళకు కుందేలు బెదురుతుందా?
తాతకు దగ్గులు నేర్పించుట.
తేలుకు పెతనమిస్తే తెల్లవార్లు కుట్టిందట.
తన కొపమే తన శత్రువు.
తన్ను మాలిన దర్మము మొదలు చెడ్డ బేరము.
తంతే బూరెల బుట్టలొ పడ్డట్లు.
తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.
తెగేదాక లాగవద్దు.
తేనె పూసిన కత్తి.
తిక్కలోడు తిరనాల్లకు వెలితే ఎక్క దిగ సరిపోయిందట.
తినే ముందు రుచి అడగటం ఎందుకు?
తినగ తినగ గారెలు చేదు.
తిండి కోసం బ్రతకకూడదు, బ్రతకడం కోసం తినాలి.
తిండికి తిమ్మరాజు, పనికి పొతురాజు.
తిక్క మొగుడితో తీర్థానికి వెలితే తీర్థం అని తిప్పి తిప్పి కొట్టాడట.
తిమ్మిని బమ్మిని చెయ్యడం.
తుమ్మితే ఊడిపొయే ముక్కు.
సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్టంలో కూడ వసంతాలన్నడట.
సంసారం చెద్దామని సప్తసముద్రాలలో స్నానం చెయ్యబోతే, ఉప్పు ఎక్కువై వున్నది కాస్తా ఊడింది.
సంగీతానికి చింతకాయలు రాలుతాయ?
సంకలో పిల్లొడిని ఉంచుకొని ఊరంా వెతికినట్టు.
సంతొషమే సగం బలం.
సర్వేంద్రియానాం నయనం ప్రదానం.
సత్రం భోజనం మఠం నిద్ర.
సీత కస్టాలు సీతవి, పీత కస్టాలు పీతవి.
సిగ్గు విడిస్తే శ్రీరంగమే.
సొమ్మొకడిది సోకొకడిది.
శుభం పలకరా పెళ్లికొడకా అంటే పెళ్లికూతురు ముండ ఎక్కడ చచ్చింది అని అడిగాడట.
పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23
తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 17

వడ్డించే వాడు మనవాడైతే, యే పంక్తిలో ఉంటే ఏమి?
వడ్ల గింజలో బియ్యపు గింజ.
వెన్నతో పెట్టిన విద్య.
వెర్రి వెయ్యి విదాలు.
వెయ్యి అబద్దాలాడైనా ఒక పెళ్లి చెయ్యమన్నారు.
వినాశ కాలే విపరీత బుద్ది.
వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే చెప్పేవాడు వేదాంతిట.
వినే వాడుంటె, అరవంలో హరికథ చెప్పాడట నీలంటివాడు.
విశ్వేశ్వరుడికి లేక విభూది నాకుతుంటే, నందీశ్వరుడు వచ్చి నాకేది అని అడిగాడట.
రాజుగారి దివానములో చాకలోడి పెత్తనము.
రాజు పెళ్లానికి ముష్టి రాత ఎవడు తప్పించగలడు?
రామాయణంలో పిడకల వేట.
రాత రాళ్ళ పాలైతే, మొగుడు ముండ పాలు అయ్యాడట.
రాజు గారి రెండవ భార్య మంచిది అన్నట్టు.
రాజు గారు తలచు కొంటె దెబ్బలకు కొదువా.
రాజును చూసిన కన్నులతో మొగుడ్ని చూస్తే చులకనలే.
రామాయణం అంతా విని సీత రాముడుకి ఎమౌతుంది అని అడిగాడంట.
రంకు మొగుడు, బొంకు పెళ్లాం.
రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అన్నట్లు.
రవి కాంచని చొటు కవి గాంచునట.
రెండు పడవల మీద ప్రయాణం
రోలు వచ్చి మద్దెలతొ మొర పెట్టుకుందిట.
రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు.
రౌతు కొద్దీ గుర్రము.
రుణ శేషం, శత్రు శేషం ఉంచరాదు.
ఉన్నదీ పోయింది, ఉంచుకున్నదీ పోయింది.
ఉపకారానికి పోతె అపకారమెదురైనట్లు.
ఉరుము ఉరుమి మంగలం మీద పడ్డట్లు.
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కుతానందట
తడి గుడ్డతొ గొంతు కోసినట్లు.
తాదూర కంత లేదు కానీ మెడకో డోలు.
తా చెడ్డ కోతి వనమెల్ల చెరచిందట.
తాడి తన్నువాని తల తన్ను వారు ఉండును.
తాలిబొట్టు బలమువల్ల తలంబ్రాల వరకు బతికాడు.
తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు

పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23
తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,
http://www.nlginfo.blogspot.com/2014/12/nalgonda-town-asara-pensioners-2nd-list.htmlhttp://www.nlginfo.blogspot.com/2014/12/motors-and-pump-sets-sales-and-repair.html